నవతెలంగాణ-ఆలేరు టౌను
చీకట్లను పారద్రోలుతూ వెలుగులు పంచే కార్తీక దీప మహోత్సవం, ఆలేరు పట్టణంలో మంగళవారం భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శివాలయం, శ్రీ చాముండేశ్వరాలయం, శ్రీ లక్ష్మీదేవి గోదాదేవి సహిత రంగనాయక ఆలయం, శ్రీ కనకదుర్గా దేవి ఆలయంలో కార్తీక దీపోత్సవ మహోత్సవంలో భక్తులు పోటెత్తారు. ఉదయం నాలుగు గంటల సమయం నుండే భక్తులు స్నానమాచారించి, నూతన వస్త్రాలు ధరించి, తులసి కోట వద్ద దీపారాధన నిర్వహించారు. శివాలయాలలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించడంతోపాటు, గోత్రనామాలతో ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.





కామెంట్‌లు (0)