Magazines

ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

3 రోజుల క్రితం

ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Revanth Reddy

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – కుభీర్: మండల కేంద్రం కుభీర్‌లో ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు గృహప్రవేశాలు కూడా నిర్వహిస్తోందన్నారు.


దీపావళి పండుగను ప్రతి ఇందిరమ్మ ఇంట్లో ఆనందంగా జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్, బషీర్, మైపాల్‌రెడ్డి, పురంశెట్టి రవికుమార్, బంక బాబు, శివాజీ, కొట్టె హనుమల్లు, సాయబ్‌రావు, కందురు సాయినాథ్, మాజీ జెడ్పీటీసీ శంకర్ చావన్, హైమద్, గంగయ్య, సూది రాజన్న, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్