Magazines

తెలంగాణను కాంగ్రెస్‌ మళ్ళీ పదేండ్లు వెనక్కి నెట్టింది

1 గంట క్రితం

mla
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

"ఆడలేక మద్దెల దరువు అన్నట్టు.. మీకు పరిపాలన చేతకాక, మూడు ఏండ్ల నుండి కేసీఆర్ మీద, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద ఏడుస్తూనే కాలం వెళ్ళదీస్తుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం నవతెలంగాణతో బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండి పడ్డారు. "పంటలు వేయొద్దు..నీళ్లు, కరెంట్ ఇవ్వలేము..అని మీ చేతులెత్తేసి కరువు పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. "ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు" అన్నారు. వర్షపాతం తగ్గుతుందని, కరువు ఉంటుందని 8 నెలల క్రితమే నిపుణులు హెచ్చరించినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని తెలిపారు.


​మేడిగడ్డ వద్ద వందలాది టీఎంసీల ప్రాణహిత, గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా కన్నెపల్లి పంపులు నడిపి నీళ్లు ఎత్తకుండా ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తోందని ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు నాయుడు పట్టిసేమ ద్వారా గోదావరి నీళ్లను, కృష్ణ నీళ్లను 600 కి. మి దూరంలో ఉన్న కుప్పంకు తీసుకెలుతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవకాశం ఉన్నా కాళేశ్వరం ద్వారా కేసీఆర్ ఎక్కడ మంచి పేరు వస్తుందోనని 100 కి. మి దూరంలో ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీకి నీళ్లు తీసుకురావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడిగడ్డ గేట్లు దించకుండానే పారుతున్న గోదావరి నుండి కన్నెపల్లి మోటార్ల ద్వారా నీళ్లు ఎత్తిపొసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కావాలనే నీళ్లను ఆంద్రాకు వదిలేసిందని దుయ్యబట్టారు. అందుకే నేడు తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ముంచుకొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని పేర్కొన్నారు.


ఎస్సారెస్పీ పునర్జీవం విస్మరణ –నిజామాబాద్ జిల్లాకు, బాల్కొండకు అన్యాయం

కేసీఆర్ ముందుచూపుతో రూపొందించిన 'ఎస్సారెస్పీ పునర్జీవ పథకం' అమలు చేస్తే వరద కాలువ ద్వారా ఎస్‌ఆర్‌ఎస్‌పీకి నీళ్లు మళ్లించి నిజామాబాద్ జిల్లాలోని మరియు బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని లిఫ్టులు నడిపించి, చెరువులు నింపే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నేడు నిజామాబాద్ జిల్లా మరియు బాల్కొండ నియోజకవర్గంలో చెరువుల్లో నీళ్లు లేక భూగర్భ జలాలు పడిపోయి బోర్లు నీళ్లు పోయక రైతులు గోసపడుతున్నారు.

కరెంట్ కష్టాలు – కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనం

తెలంగాణ ఏర్పడినప్పుడు 7,000 మెగావాట్లుగా ఉన్న స్థాపిత సామర్థ్యాన్ని కేసీఆర్ 20,000 మెగావాట్లకు పెంచారు. ముందు చూపుతో కేసీఆర్ కొత్తగా ఎన్నో థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి కరువులో కుడా విద్యుత్ కొరత రాకుండా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఆ విద్యుత్ కేంద్రాలను మీకు అప్పజెప్పితే వాటిని నడిపియ్యడం కూడా మీకు చేత కావట్లేదా అని విరుచుకుపడ్డారు. సింగరేణి లోని బొగ్గుని బయట రాష్ట్రాలకు అమ్ముకుంటూ మన థర్మల్ విద్యుత్ ప్లాంటలకు బొగ్గు లేకుండా చేసి కొత్తగూడెం (800 MW), భద్రాద్రి (540 MW), యాదాద్రి (4,000 MW) వంటి థర్మల్ ప్లాంట్లను మూసేసి కరెంట్ కష్టాలు తీసుకోచ్చిన చేతకాని ప్రభుత్వం మీది. బొగ్గులేని పక్క రాష్ట్రం ఏపీలో కరెంట్ కష్టాలు ఎందుకు లేవు. మన తెలంగాణ లో కరెంట్ కష్టాలు ఎందుకు ఉన్నాయి? అని ప్రశ్నించ్చారు.


నేడు సీతక్క వచ్చి సుద్దులు చెబుతారా? ఇందిరమ్మ ఇళ్లు– అభివృద్ధి పనుల నిర్లక్ష్యం

గ్రామసభల్లో పారదర్శకంగా కాకుండా, కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లో కూర్చుని కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు పంచుకుంటున్నారు. ఇండ్ల మంజూరు కోసం ముడుపులు తీసుకుంటున్నారు. ప్రతి మండలంలో ఇందిరమ్మ కాలనీలో వేసిన సీసీ రోడ్లు, అలాగే కేసీఆర్‌ కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టి పేదలకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సీతక్క అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అయిన ఒక్క కొత్త రోడ్డు వేయలేదు, పైగా చేసిన పనులకు బిల్లులు కుడా చెల్లించక కాంట్రాక్టర్లు పనులు చేయలేని పరిస్థితికి తీసుకోచ్చారు.


ఇప్పటికైనా కేసీఆర్‌ మీద, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీద ఏడ్చులు ఆపేసి, రైతులకు సాగునీరు, కరెంట్ ఇవ్వడంపై అలాగే మహిళలకు, యువతకు మీరు ఇచ్చిన హామీల అమలుపై ద్రుష్టి పెట్టాలని మంత్రి సీతక్కకు సూచిస్తున్నానని, అయినా సరే మీ తీరు మార్చుకోకపోతే తగిన సమయంలో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం అని అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్