నవతెలంగాణ – ఆలేరు రూరల్
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను పురస్కరించుకొని మందనపల్లి గ్రామంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల ఎదుట ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు పద్మశ్రీ సుదర్శన్, గ్రామ సర్పంచ్ సిరుమర్తి రేణుక నరసయ్య తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం వర్ధిల్లాలని, అంబేద్కర్ ఆశయాలు జయించాలని నినాదాలు చేశారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో పద్మశ్రీ సుదర్శన్ మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో కీలక కృషి జరిగిందని పేర్కొన్నారు. సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు సాగిన రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ దేశ ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, హక్కులను అందించిందన్నారు.
సామాజిక న్యాయం, సమాన అవకాశాల స్ఫూర్తిని బలహీనపరిచే ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అణగారిన వర్గాల హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంబేద్కర్ ఆశయాలను మాటల్లోనే కాకుండా ఆచరణలో కొనసాగించాలని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడినప్పుడే రాజ్యాంగానికి నిజమైన గౌరవం దక్కుతుందని పద్మశ్రీ సుదర్శన్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కమిటీ కార్యదర్శి సర్వర్ నాయక్, ప్రధానోపాధ్యాయులు సయ్యద్,ఉపాధ్యాయులు,విద్యార్థులు,రిటైర్డ్ ఉపాధ్యాయులు కిష్టయ్య,అంగన్వాడీ టీచర్లు సుంచు రాజమణి,అనిత,వార్డు సభ్యులు కడకంచి సిద్ధులు,తమ్మడి అంజయ్య,ఇందిరమ్మ కమిటీ బాధ్యులు అన్నం సిద్ధులు, యువ నాయకులు ఊట్కూరి సురేష్, కుర్రి సాయి, కడకంచి కృష్ణ, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పురుమ భాస్కర్,గ్రామ పెద్దలు డేగల రామనరసయ్య, గూడూరు నరసింహులు,నర్మట వెంకటేష్,లైన్మెన్ శ్రీనివాస్,దావేర వీరయ్య,నోముల నర్సమ్మ, జువ్వగాని మంజుల, ఊట్కూరు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)