Magazines

తుపాన్ వేళ బాధితులకు అండగా కౌన్సిలర్ కొల్లి రవికిరణ్

1 గంట క్రితం

rain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- నీట మునిగిన ఇళ్లలో బాధితుల కష్టాలు

- వెంటనే స్పందించి భోజనాల ఏర్పాటు

నవతెలంగాణ – అశ్వారావుపేట : తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెటమలపల్లి గ్రామంలో పలు ఇళ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో బాధిత కుటుంబాలు ఆహారం, ఇతర నిత్యావసరాల కోసం ఇబ్బందిపడుతున్న విషయం తెలుసుకున్న కౌన్సిలర్ కొల్లి రవికిరణ్ వెంటనే స్పందించారు.

ఆపదలో ఉన్న కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు. తుపాన్, వరద పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లను వదిలి ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఆకలితో అలమటించకుండా చర్యలు తీసుకోవడం బాధితులకు కొంత ఊరటనిచ్చింది.

ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవ అని, అవసరమైన వారికి సహాయం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా కొల్లి రవికిరణ్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్