Magazines

ఎవరూ అధైర్యపడొద్దు..

1 గంట క్రితం

20260218
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- మీకు అండగా మేం ఉంటాం

- మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జూపల్లి రమేష్‌బాబు

నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు వీధులు, కాలనీలు వర్షపు నీటితో నిండిపోయి ప్రజలు ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జూపల్లి రమేష్‌బాబు ప్రజలకు భరోసా కల్పించారు. 

వరద ముంపు బాధితులు ఎవరూ అధైర్యపడొద్దని, “మీకు అండగా మేం ఉంటాం” అంటూ పుర ప్రజానీకానికి ధైర్యం చెప్పారు.

వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బందిని అప్రమత్తం చేసి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జూపల్లి రమేష్‌బాబు మాట్లాడుతూ, “భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా ఉంటాం. సమస్యాత్మక ప్రాంతాల్లో సత్వర చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీసు శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు” అని తెలిపారు.

ఇంకా విస్తృతంగా సహాయక సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎక్కడైనా వరద, నీటి నిల్వలు లేదా ఇతర సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్