Magazines

వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా

53 నిమిషాల క్రితం

help
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆహారం, తాగునీరు అందజేసిన కాసాని పద్మ, కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి

- పోలీసు, మున్సిపల్ సిబ్బంది సేవలకు అభినందనలు

నవతెలంగాణ – అశ్వారావుపేట : పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు కాసాని పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి అండగా నిలిచారు.

భారీ వర్షాల కారణంగా ప్రయాణాలు కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్న వారికి మానవతా దృక్పథంతో స్పందించి ఆహార పొట్లాలు, బిస్కెట్లు, తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఆకలితో ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తమ వంతు సహాయం అందించారు.

ఈ సందర్భంగా భారీ వర్షాల మధ్య ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసు శాఖ, మున్సిపల్ సిబ్బంది సేవలను వారు అభినందించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలకు ధైర్యం చెబుతూ, సహాయక చర్యలు చేపడుతూ ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్న అధికారులు, పోలీసు, మున్సిపల్ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్