నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు చల్లగుండ్ల అప్పారావు సతీమణి చల్లగుండ్ల మధులత ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా విజయ్ కుమార్ మంగళవారం వారి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా దయానంద్ మధులత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)