నవతెలంగాణ-హైదరాబాద్ : మైనింగ్ గుంతలో పడి ఇద్దరు మేకల కాపరులు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా చోటు చేసుకుంది. ధరూర్ మండలం తరిగోపుల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతులు తరిగోపులకు చెందిన శ్రీనివాస్ (43), అశోక్ (21)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.






కామెంట్‌లు (0)