Magazines

జేవీఆర్ ఓసీ-2 ప్రాజెక్టు అధికారిగా ఏఎల్ఎస్వీ సునీల్ వర్మ బాధ్యతల స్వీకరణ

1 గంట క్రితం

ALSV Sunil
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

- ​రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా సమష్టి కృషి

నవతెలంగాణ-సత్తుపల్లి

 కిష్టారం ఓసీ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తూ బదిలీపై జేవీఆర్ ఓసీ-2 ప్రాజెక్టు అధికారిగా (పీఓ) వచ్చిన ఏఎల్ఎస్వీ సునీల్ వర్మ మంగళవారం  బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆవరణలో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సిబ్బంది నూతన పీఓ సునీల్ వర్మకు ఘనంగా స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.


అనంతరం సునీల్ వర్మ మాట్లాడుతూ ప్రాజెక్టు సర్వతోముఖాభివృద్ధి, నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధన, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటిస్తూ, రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషి, పరస్పర సమన్వయంతో జేవీఆర్ ఓసీ-2 ప్రాజెక్టును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అందరి సహకారంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.‌చివరగా పరిచయ కార్యక్రమంలో పాల్గొని తనకు ఆత్మీయ స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ  ప్రాజెక్టు అధికారి సునీల్ వర్మ ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్