Magazines

మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌

13 నిమిషాల క్రితం

entertainer
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

యశ్వంత్, ధనశ్రీ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘హే కన్నమ్మ’. శశి కుమార్ ముత్తులూరి రచన, దర్శకత్వంలో, జీ స్టూడియోస్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు. ఈనెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. హీరో యశ్వంత్ మాట్లాడుతూ, ‘దిల్ రాజు నన్ను ఆఫీసుకు పిలిచి, ఒక మ్యూజికల్ డాన్స్ సినిమా చేస్తున్నాం. నువ్వే హీరో అని చెప్పగానే షాక్ అయ్యాను. ఈ కథ మనందరి జీవితాల్లో జరిగే పరిస్థితులకు దగ్గరగా ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ’ అని అన్నారు. ‘నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చూసి దిల్ రాజు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఆరు పాటలు వచ్చేలా మొత్తం కాన్సెప్ట్‌ను సెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కించాం. థియేటర్‌లో సినిమా ఒక కాన్సర్ట్‌లా ఉంటుంది. మ్యూజిక్‌తోనే కథ చెప్పాం. ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కుతుంది, తేలికపడుతుంది. ఈ సినిమాలోని పాటలన్నీ గుర్తుండిపోయేలా ఉంటాయి. సినిమా మీ అందరి మనసులను హత్తుకుంటుంది’ అని డైరెక్టర్ శశి కుమార్ చెప్పారు. ‘మా కలలు నిజమవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’ అని కథానాయికలు అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్