Magazines

భిన్న బ్యాక్‌డ్రాప్‌లో ‘ఆది రుద్రాక్ష‍’

10 నిమిషాల క్రితం

Rudraksha
avatar
balaji

ప్రచురించబడింది నవం 24, 2026 | 1 నిమిషాల చదవడం

పంచమహాశక్తులు, మహారహస్యం, దుష్టశక్తుల మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న పౌరాణిక యాక్షన్ థ్రిల్లర్ ‘ఆది రుద్రాక్ష’. షేక్ మహబూబ్ బాషా నిర్మాణంలో ఆర్యన్ హీరోగా నటిస్తూ, ఆయన రచన, దర్శకత్వంలో రూపొందు తున్న ఈ సినిమా తొలి గ్లిమ్స్‌ను హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో దర్శకుడు ఆర్యన్ మాట్లాడుతూ, ‘కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున మా సినిమా గ్లిమ్స్ విడుదల కావడం ఎంతో ఆనం దంగా ఉంది. సినిమా గ్లిమ్స్‌ను నటుడు విజయ్ ఆంటోని వీక్షించి, అభినందించడం మా చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని అన్నారు.

‘దర్శకుడు ఆర్యన్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథపై ఆయనకున్న స్పష్టత, అంకితభావం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మంచి నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి అందరం సమష్టిగా కృషి చేస్తున్నాం’ అని నిర్మాత షేక్ మహబూబ్ బాషా చెప్పారు. హీరోయిన్ రూప మాట్లాడుతూ, ‘ఆర్యన్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఇందులో భాగమయ్యే అవకాశం కల్పించినందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. మంచి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. భిన్న బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్