అంబేద్కర్ చౌరస్తాలో రెండు గంటలు ధర్నా
సిఐ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంలోని భవాని తల్లి పిల్లల ప్రవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సిఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు.
డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందని ప్రజాసంఘాల నాయకులు కుటుంబ సభ్యులు బహిర్గతంగా ఆరోపించారు. వివరాల ప్రకారం బల్మూరు మండలం పోలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన మహిళ ఐదు రోజుల క్రితo భవాని ఆసుపత్రిలో డెలివరీ చేశారు. డిశ్చార్జ్ చేయడానికి సిద్ధమయ్యారు.
బాలింతకు ఒక్కసారిగా బీపీ పెరిగింది. దీంతో వైద్యులు ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి కోమాలోకి జారుకుందని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని ఆందోళన చేశారు.
కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కొందరు నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేసి, బాధ్యులైన వైద్యులపై కేసు నమోదు చేయాలని, ఆసుపత్రిని సీజ్ (ముసి వేయాలని) డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు వినకపోవడంతోపులాటకు దారితీసింది. బాధిత బంధువులకు సహకరిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు.







కామెంట్లు (0)