Magazines

మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలి

17 నిమిషాల క్రితం

Top Maoist leader Ganapathi should surrender.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 2 నిమిషాల చదవడం

214 మందికి రూ.5.59 కోట్ల

ఆర్థిక సాయం అందజేత : డీజీపీ సీవీ ఆనంద్‌

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

మావోయిస్టు ఆగ్రనేత గణపతితో పాటు మరో ముగ్గురు లొంగిపోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌విజ్ఞప్తి చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, తాత్కాలిక ఆర్థిక సహాయానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇందులో భాగంగా 214 మందికి రూ.5 కోట్ల 59 లక్షల 50 వేల నగదు రివార్డులు, పునరావాస ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 824 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. వీరిలో తెలంగాణకు చెందినవారు 59 మంది ఉన్నట్లుగా వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణ అవసరాల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున తాత్కాలిక ఆర్థిక సాయం అందించామని తెలిపారు. వారి ప్రభుత్వ రివార్డు లకు అనుగుణంగా మిగిలిన ఆర్థిక సాయాన్ని దశలవారీగా అందిస్తు న్నామన్నారు. వివిధ దశల్లో అందించిన సాయంతో కలిపి ఇప్పటివరకు జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు మొత్తం రూ.17 కోట్ల 68 లక్షల 35 వేల నగదు పంపిణీ చేసినట్లు వివరించారు. ఆధార్‌ కార్డులు లేకపో వడంతో పలువురికి బ్యాంకు ఖాతాలు తెరవడం ఇబ్బందిగా మారిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ఎస్‌ఐబీ అధికారులు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని బ్యాంకు ఖాతాల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు. లొంగిపోయిన వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు 59 ఆరోగ్య రక్షణ కార్డులు అందించామని పేర్కొన్నారు. ఉచిత వైద్య చికిత్స అందించడంతోపాటు నిమ్స్‌, వారి వారి ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుం టున్నామన్నారు. నివాస వసతి కింద తెలంగాణకు చెందిన పది మందికి ఇండ్లు మంజూరు పూర్తికాగా, మరో 49 మందికి ఇండ్లు కల్పించ నున్నట్లు చెప్పారు. కొంతమంది లొంగిపోయిన మావోయిస్టులు మారుమూల ప్రాంతా ల్లో ఉండటం వల్ల పునరావాస సాయం అందించడంలో జాప్యం జరిగిందన్నారు. అడవుల్లో జీవించిన వారికి సాధారణ జనజీవనంపై అవగా హన కల్పించడంతోపాటు వారి అభిరుచులకు అనుగుణంగా ఉపాధి అవకా శాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. మావో యిస్టుల నుంచి పెద్ద సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 2026 నాటికి తెలంగాణ -ఛత్తీస్గడ్ సరిహద్దు లోని కర్రగుట్ట ప్రాంతంలో మొత్తం తొమ్మిది ఆయుధాల డంపులు గుర్తించగా, వాటిలో 252 తుపాకులు, 359 బీజీఎల్‌ సెల్స్‌, నాలుగు ఎల్‌ఎంజీలు, 48 ఏకే-47 తుపాకులు లభించాయని తెలిపారు. కర్రెగుట్ట ప్రాంతంలో భారీగా పేలుడు పదార్థాలు, ల్యాండ్‌మైన్‌లు ఉన్నాయని, సీఆర్‌పీఎఫ్‌, ఛత్తీస్‌గఢ్‌ డీఆర్‌జీ బలగాల సమన్వయంతో ల్యాండ్‌మైన్‌లను జాగ్రత్తగా వెలికితీసి నిర్వీర్యం చేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం పర్యాటకులకు ఆ ప్రాంతంలో అనుమతి ఇవ్వడం లేదని, ల్యాండ్‌మైన్‌ల తొలగింపు పూర్తయిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్‌ గణపతితోపాటు మరో ఇద్దరు లొంగిపోయి సాధారణ జీవితం గడపాలని కోరారు. లొంగిపోయిన వారు తిరిగి మావోయిస్టు కార్యక లాపాల వైపు వెళ్లకుండా నిరంతర నిఘా, సంప్రదింపులు, పర్యవేక్షణ కొనసాగిస్తామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్