Magazines

రైతు ఉద్యమ హామీల అమలుకు 26న దేశవ్యాప్త ఆందోళన

15 నిమిషాల క్రితం

Nationwide protest on the 26th to
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026 | 3 నిమిషాల చదవడం

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి

అమెరికాతో వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి తగ్గాలి

ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి : ఎస్కేఎం నేత‌ల డిమాండ్

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) గురువారం దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, అమెరికాతో కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందం ప్రక్రియ నుంచి కేంద్రం వెనక్కి తగ్గాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధత కల్పిం చాలని డిమాండ్‌ చేసింది. సోమ‌వారం నాడిక్క‌ డ ప్రెస్ క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఎస్కేఎం నేత‌లు యుధ్వీర్ సింగ్, విజూ కృష్ణన్ రాజన్ క్షీరసాగర్, పురుషోత్తం శర్మ, సత్యవాన్, విమల్ త్రివేది, పి కృష్ణప్రసాద్, శశికాంత్‌, చరణ్‌సింగ్ మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగించిన చారిత్రాత్మక ఉద్యమానికి ఆరేండ్లు పూర్తవుతున్న నేపథ్యం లో ఈ ఆందోళన చేపడుతున్నట్టు ప్రకటిం చారు.ఈ సందర్భం గారైతుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను జిల్లా కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి అందజే యనున్న‌ట్టు తెలిపారు. 2021 డిసెంబర్‌ 9న రైతు ఉద్య మాన్ని విర మింపజేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం సం యుక్త కిసాన్‌ మోర్చాకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమ లు చేయలే దని విమ‌ర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీల ను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు.

​ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి

​ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని ఎస్కేఎం నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు, ఎగుమతులపై ప్రభావం చూపే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని, ముఖ్యంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం దిశగా కేంద్రం ముందుకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఒప్పందాల వల్ల దేశీయ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వ్యవసాయ రుణాలను సమగ్రంగా మాఫీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పంటలు, పశువుల బీమా కోసం ప్రభుత్వ రంగంలో ప్రత్యేక బీమా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రధానమంత్రి పేరుతో అమలవుతున్న పంటల బీమా పథకాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో ఆందోళనలు

రైతుల సమస్యల పరిష్కారం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోరుతూ దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనున్న‌ట్టు ఎస్కేఎం నేతలు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న‌ట్టు పేర్కొన్నారు. ఢిల్లీలోని మందిర్‌ మార్గ్‌ నుంచి జంతర్‌మంతర్‌ వరకు రైతుల ప్రదర్శన నిర్వహించనున్నామ‌ని అన్నారు. టిక్రీ, బహదూర్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతాల్లోనూ రైతులు నిరసనలు చేపట్టాలని నిర్ణయించిన‌ట్టు పేర్కొన్నారు. కేరళ రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లోనూ ఆందోళనలు నిర్వహించనున్న‌ట్లు చెప్పారు. పంజాబ్‌లో నాలుగు కేంద్రాల్లో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టను న్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతా ల్లోనూ నిరసనలు జరగనున్నాయ‌ని తెలిపారు.

కార్మిక, విద్యార్థి సంఘాల మద్దతు

ఎస్కేఎం ఆధ్వర్యంలో జరగనున్న దేశవ్యాప్త ఆందోళనకు ట్రేడ్‌ యూనియన్‌ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికుల సమస్యలను అనుసంధానిస్తూ ఉద్యమాన్ని విస్తృతం చేయాలని ఆయా సంఘాలు నిర్ణయించాయి. ఎస్‌ఎఫ్‌ఐ సహా పలు విద్యార్థి సంఘాలు, మహిళా, యువజన సంఘాలు కూడా ఈ ఆందోళనల్లో భాగస్వాములు కానున్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల రద్దు, అమెరి కాతో వాణిజ్య ఒప్పందం నుంచి కేంద్రం వెనక్కి తగ్గడం వంటి డిమాండ్లతో పాటు రైతు, వ్యవసాయ కార్మిక, శ్రామిక ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఈ ఆందోళనలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సంఘాల భాగస్వామ్యంతో నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.


కార్మిక హక్కుల పరిరక్షణకు పోరాటం

రైతుల సమస్యలతో పాటు కార్మికుల హక్కుల పరిరక్షణ కూడా ఆందోళనలో ప్రధాన అంశంగా ఉంటుందని ఎస్కేఎం నాయకులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలనీ, కనీస వేతనాన్ని నెలకు రూ.42 వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, రోజువారీ వేతనం రూ.700 చొప్పున ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని కోరారు.అదే విధంగా ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

విద్యుత్‌, 
విత్తన బిల్లులు ఉపసంహరించాలి

​విద్యుత్‌ ప్రయివేటీకరణ బిల్లును, విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలని ఎస్కేఎం నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని, ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను బలవంతంగా ఏర్పాటు చేయడాన్ని తక్షణమే ఆపాలని కోరారు. భూసేకరణ పేరుతో రైతుల భూము లను బలవంతంగా లాక్కోరాదని, భూములు సేకరించే సందర్భంలో భూసేకరణ, పునరా వాసం, పునరుద్ధరణ చట్టం (ఎల్‌ఏఆర్‌ఆర్‌) ప్రకారం న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులు, అటవీ ప్రాంతాల నివాసితులకు కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్