నవతెలంగాణ–నాచారం: చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివశక్తి నగర్‌లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల అంచనా వ్యయంతో 400 మీటర్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలు మురుగునీటి సమస్యలతో ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం చూపించేందుకు యూజీడీ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. స్థానికుల అవసరాలకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పరశురాములు, శ్రీనివాస్, సత్తయ్య, ప్రేమ్ నాయక్, కుమారయ్య, మల్లేష్, ఆర్. రామ్‌రెడ్డి, శ్రీశైలం, యాదగిరి, స్రవంతి, పద్మ, సంబంధిత అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)