నవతెలంగాణ - హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని కల్తీ పాల తయారీకేంద్రంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి కల్తీ పాలు తయారుచేస్తున్నట్లు ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం అందింది. స్పందించిన పోలీసులు ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారంలో కల్తీ పాలు తయారుచేస్తు్న్న కేంద్రంపై దాడి చేసి 100 లీటర్ల కల్తీ పాలు, 35 పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ పాల తయారీకేంద్రంపై పోలీసుల దాడి
27 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)