Magazines

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

20 నిమిషాల క్రితం

Wife kills husband with boyfriend
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం తండాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన చందు (40), పావనిలకు 2014లో వివాహమైంది. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పావనికి దరావత్‌ సంతోష్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.

భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన పావని, గురువారం రాత్రి సంతోష్‌ను ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి చందును హత్య చేసినట్లు సమాచారం. అనంతరం మృతదేహాన్ని సంచిలో మూటకట్టి సమీప గ్రామం వద్ద రోడ్డు పక్కన పడేశారు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పావని, సంతోష్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్