నవతెలంగాణ-ఆలేరు టౌను
వాలీబాల్, టాగ్ ఫర్, వార్వార్, షటిల్, బ్యాట్మెంటన్, పరుగు పందాల క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పూజారి వెంకటేశం పట్టణంలో శనివారం బహుమతులు పంపిణీ చేశారు. మేరా యువభారత్ సౌజన్యంతో
ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి, పూల నాగయ్య ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు.
గత రెండు రోజుల నుండి వాలీబాల్ టాగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, పరుగు పందాలలో జరుగుతున్న ఆలేర్ బ్లాక్ క్రీడలు విజయవంతంగా నిర్వహించబడ్డాయని, ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా జడ్పిహెచ్ఎస్, పీఎం శ్రీ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు పంగ మేఘరాజు, కళాశాల అధ్యాపకులు జూకంటి వెంకటేష్, ఎండి అబ్బాస్, వెంకటరమణ, షూటింగ్ బాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోత్కూరు మానస, ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు పూల చంద్రకుమార్, పారానంది రాహుల్ తేజ, రవికుమార్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.
బాలుర విభాగంలో వాలీబాల్ ప్రథమ బహుమతి సారాజ్పేట్, ద్వితీయ బహుమతి విఆర్ కళాశాల ఆలేరు బ్యాడ్మింటన్, ప్రధమ బహుమతి రాహుల్ తేజ, ద్వితీయ బహుమతి రవికుమార్, తృతీయ పాల్, రన్నింగ్ లో ప్రధమ బహుమతి, చండీశ్వర్, ద్వితీయ ఈశ్వర్, తృతీయ, రవికుమార్ అందుకున్నారు.
బాలికల విభాగంలో థగ్ ఆఫ్ వార్, ప్రధమ బహుమతి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ద్వితీయ బహుమతి పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్ ఆలేర్, బ్యాడ్మింటన్ ప్రథమ బహుమతి గెలుపొందారు.భార్గవి, ద్వితీయ బహుమతి, భవాని తృతీయ బహుమతి, ఉమా, రన్నింగ్ లో
ప్రథమ బహుమతి దీక్షిత, ద్వితీయ బహుమతి రేచల్, తృతీయ బహుమతి, అంజలి గెలుపొందారు.
గెలుపొందిన క్రీడాకారులకు, అభినందనలు తెలియజేస్తూ బహుమతులుగా షీల్డను అందజేశారు.







కామెంట్లు (0)