Magazines

విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ

5 రోజుల క్రితం

school bags
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - ఆలేరు రూరల్‌
పదవీ విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమే తప్ప, సమాజానికి చేసే సేవలకు కాదని నిరూపిస్తూ విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు, పిఆర్టియూ రాష్ట్ర మాజీ ఆడిట్ కమిటీ సభ్యులు భూషపాక రాములు, ఉషారాణి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. వీరు కొలనుపాక పీఎంశ్రీ  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 6వ,7వ తరగతులకు చెందిన 110 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను ఉచితంగా అందజేశారు.


ఈ సందర్భంగా పాఠశాల బృందం మాట్లాడుతూ..పదవీ విరమణ వయస్సుకే తప్ప, సేవా కార్యక్రమాలకు కాదని చాటుతున్న భూషపాక రాములు, ఉషారాణి దంపతుల సేవాభావం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడే ఇలాంటి కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ దంపతులను ఘనంగా అభినందించారు.


ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆకుల వేణుగోపాల్ తో పాటు సీనియర్ ఉపాధ్యాయురాలు ఏ. సత్యవతి,పి.సుకన్య, ఆర్. నాగేశ్వరరావు,బి.రవీందర్, శ్వేత బిందు,చామల శ్రీధర్, సౌజన్య, పారిజాత, రవళి, ఉష తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్