Magazines

ఇందిరాగాంధీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

1 రోజు క్రితం

Indiragandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

సింగిల్ విండో ఛైర్మెన్ - గూడూరు శ్రీనివాస్ రెడ్డి 

నవతెలంగాణ - కడ్తాల్‌

భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోతుగంటి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమనగల్, కడ్తాల్ సింగిల్ విండో ఛైర్మెన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ నాయకులు మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ఆశయాలను కొనసాగిస్తూ పేదల సంక్షేమం, దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తన ధైర్యసాహసాలతో ప్రపంచానికి భారతదేశ సత్తాను చాటిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు.


మహిళలు తలచుకుంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని తన జీవితంతో నిరూపించిన స్ఫూర్తిప్రదాత అని అన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తూ బ్యాంకుల జాతీయీకరణ వంటి కీలక నిర్ణయాలతో సామాన్యులకు ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించారని గుర్తుచేశారు. దేశ ఆర్థిక, రక్షణ రంగాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని, దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన మహానేతగా ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో పట్టణ సర్పంచ్ రాయికంటి బిక్షపతి, జవహర్ లాల్, ఉపసర్పంచ్ లు యాదగిరి రెడ్డి, లకుపతి నాయక్, హీరా సింగ్, సింగిల్ విండో డైరెక్టర్స్ కిషన్ నాయక్, రాజు నాయక్, ఎండోమెంట్ డైరెక్టర్ పిప్పళ్ల యాదయ్య, వార్డు సభ్యులు జంగీర్ బాబా, భాను కిరణ్, విజయ్ రాథోడ్, మాజీ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, కిసాన్ సెల్ బాలరాజు మండల ప్రధాన కార్యదర్శి విక్రమ్, పట్టణ అధ్యక్షులు మాలే మల్లేష్ గౌడ్, సీనియర్ నాయకులు గురిగళ్ళ లక్ష్మయ్య, రాంచందర్ నాయక్, ఇక్బాల్ పాషా, చెందోజి, నేజ్యా నాయక్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, సోషల్ మీడియా కన్వీనర్ విష్ణు, అసెంబ్లీ ఉపాధ్యక్షులు షాబుద్దీన్, ఇమ్రాన్ మరియు తులసిరామ్, రాజేందర్ గౌడ్, శ్రీను నాయక్, శ్రీను నాయక్, ప్రవీణ్ గౌడ్, బాలకృష్ణ, శివ, నరేష్, మహేష్, లక్ష్మణ్, మణి, పవన్ మరియు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్