Magazines

పేద కార్మికుడి కుటుంబానికి అండగా మాజీ సర్పంచ్

29 నిమిషాల క్రితం

poor worker's family
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్

మండల పరిధిలోని కంచనపల్లికి చెందిన ముత్యాలు (50) మల్లెపోగు ముత్యాలు శనివారం మృతి చెందారు. మృతుడు గతంలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా పనిచేశారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్‌ మహమ్మద్ రఫీ ముత్యాలు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


అనంతరం శోకసంద్రంలో మునిగిపోయిన మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంత్యక్రియల నిర్వహణ నిమిత్తం స్థానిక నాయకులతో కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామ అభివృద్ధిలో, పారిశుద్ధ్య నిర్వహణలో ముత్యాలు అందించిన సేవలను ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గుర్తుచేసుకున్నారు. ఆపదలో ఉన్న నిరుపేద కార్మికుడి కుటుంబానికి తక్షణ సాయం అందించి ఆదుకున్న మహమ్మద్ రఫీని, స్థానిక నాయకులను గ్రామస్తులు అభినందించారు.


ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కావాలి యాదవులు విలువల జంగయ్య మాజీ ఉప్ప సర్పంచ్ రమేష్ , ఎర్ర శ్రీనివాసులు ,బచ్చయ్య , శ్రీనివాసులు, కావలి శేఖరు , శ్రీశైలం , కృష్ణయ్య , గ్రామస్తులు శంకరయ్య ,నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్