నవతెలంగాణ - హైదరాబాద్: సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకల్లో ఆయన యాదవ సోదరులతో కలిసి ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. స్థానిక ప్రజలు, యువతతో మమేకమై పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జరిగిన ఊరేగింపులో హరీశ్ రావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తలపాగా ధరించి, చేతిలో హాకీ బ్యాట్ పట్టుకుని పైకెత్తుతూ యువతతో కలిసి జోష్ ప్రదర్శించారు. తనకు బహూకరించిన కత్తిని గాల్లోకి దూశారు. సిద్దిపేటలో జరిగిన ఈ సదర్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
సిద్ధిపేట్ సదర్‌లో హరీష్‌రావు సందడి
2 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)