Magazines

కొక్కెరపాటి పుల్లయ్యకు మాతృవియోగం

28 నిమిషాల క్రితం

Kokkerapati Pullaiah
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

- వెంకటమ్మ భౌతికకాయానికి పలువురు ప్రముఖుల నివాళులు

- అంత్యక్రియలకు హాజరైన సీపీఐ(ఎం), బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు

నవతెలంగాణ - అశ్వారావుపేట

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య మాతృమూర్తి వెంకటమ్మ (100) వయోభారంతో శనివారం సాయంత్రం మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం అశ్వారావుపేటలో నిర్వహించారు. వెంకటమ్మ కుమారుడు కొక్కెరపాటి పుల్లయ్య సీపీఐ(ఎం)లో, ఆమె మూడో అల్లుడు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బీఆర్ఎస్‌లో కీలక నాయకులుగా ఉండటంతో అంత్యక్రియలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


సీపీఐ(ఎం), బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా వెంకటమ్మ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, సత్తుపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు అన్నవరపు కనకయ్య, సత్యనారాయణ, లిక్కి బాలరాజు, దొడ్డ Kokkerapati Pullaiahరవికుమార్, లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, బుడితి చిరంజీవి, సోడెం ప్రసాద్, ఐలు నాయకులు శివరాం ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు హరికృష్ణారెడ్డి, మందపాటి రాజమోహన్ రెడ్డి, డాక్టర్ భూక్యా ప్రసాద్, జుజ్జూరపు శ్రీరామమూర్తి, కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, జూపల్లి ప్రమోద్, పామాయిల్ రైతు సంఘం నాయకులు తుంబురు మహేశ్వరరెడ్డి, మద్దినేని వెంకటేశ్వర్లు, చెలికాని వెంకట్ తదితరులు పాల్గొన్నారు. వెంకటమ్మకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్