Magazines

జాతరలో నూడుల్స్ తిని 130 మంది అస్వస్థత

5 గంటల క్రితం

130 people fall ill after eating noodles at a fair
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో గ్రామ జాతరలో చౌమీన్ తిని 118 మంది చిన్నారులు, 12 మంది పెద్దలు అస్వస్థతకు గురయ్యారు. హిరి గ్రామంలో శనివారం నూడుల్స్ తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పి రావడంతో బాధితులను ఆస్పత్రులకు తరలించారు.

45 మంది చిన్నారులు, 12 మంది పెద్దలు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 73 మంది చిన్నారులు ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్