Magazines

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు: మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

1 గంట క్రితం

Indiramma houses
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ కుభీర్
ముధోల్ నియోజక వర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డి అన్నారు. కుభీర్ లోని జ్యోతి దిగంబర్ నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవానికి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేదల సొంతింటి కల సాకారానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న డాక్టర్ పోశెట్టిని పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష‍ించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయినాథ్, మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ మీరా విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చెర్మన్ సంతోష్, ఆత్మ కమిటీ చెర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్