నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని అవల్గావ్ గ్రామంలో యాభై ఏండ్ల అనుభవమున్న ఆయుర్వేద వైద్యులు ప్రకాష్‌తో ఉచిత వైద్య సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సర్పంచ్ మాన్యబాయి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన మందులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యలు ప్రకాష్ మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మందుల కంటే ఆయుర్వేద మందలు ఎంతో ఉత్తమమైనవనీ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనీ, ప్రజలు ఆయుర్వేద వైద్యాన్ని అవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాలకవర్గం వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్ విజయ్, వైద్యులు వై ప్రకాష్, న్యూట్రిషన్ సద్దాం, కార్యదర్శి సతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)