Magazines

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. రైల్వే రాకపోకలకు అంతరాయం

03 నవంబర్, 2026

Impact of Cyclone Mora: Disruption to railway services
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: మురసు తుఫాన్ తో రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏపీలోని విజయవాడ, ఒంగోలు, గూడూరు రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కరవాడి రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి. తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ విధించింది.


మొత్తం 29 రైళ్లపై తుఫాన్ ప్రభావం ఉండటంతో... 19 అప్, 10 డౌన్ రైళ్లపై అధికారులు నియంత్రణ విధించారు. కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని దారి మళ్లించడంతో పాటు రీషెడ్యూల్ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రైళ్ల నియంత్రణ కొనసాగుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణానికి ముందు రైళ్ల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. రైళ్ల సమాచారం కోసం NTES యాప్‌ను పరిశీలించాలని తెలిపారు. ప్రయాణికులు అధికారిక రైల్వే ప్రకటనలను మాత్రమే అనుసరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్