Magazines

గ్రామ సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ

2 గంటల క్రితం

Groundbreaking
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్లలో రూ.10 లక్షల ఈజిఎస్ నిధులతో గ్రామైక్య సంఘ కార్యాలయ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఎంపిడిఓ క్రాంతికుమార్, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ భూమిపూజ చేశారు. ఈజిఎస్ నిధులతో ఒక్కొక్క భవనానికి రూ.10 లక్షలతో మొత్తం 8 గ్రామ సమైక్య భవనాలు మంజూరైనట్లుగా ఏపీఎం హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందారపు సారయ్య, తిర్రి అశోక్, నిరంజన్ రావు, మేనం బాపు, స్వశకి మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్