Magazines

మండల స్థాయి ప్రత్యేక సమావేశంలో నీళ్లపై రగడ

1 గంట క్రితం

Water dispute
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మిషన్ భగీరథ పథకం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆ నీళ్లు గ్రామాల ప్రజలకు సరఫరా కాకపోవడం మండల కేంద్రంలో ఫిల్టర్ నీళ్లు అమ్మకాల డబ్బా నీళ్లు రూ.20 చొప్పున అమ్ముతున్నారంటూ అనుమతులు లేని వాటర్ ప్లాంట్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నించారు. ఈ విషయంపై మండల ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కి ప్రత్యేకంగా ప్రశ్నించారు. ఏంటి నీళ్లు ఎందుకు రావడం లేదు కారణం అడిగి తెలుసుకున్నారు. వాటర్ ప్లాంట్ల సమస్య ఏమిటి అనుమతులు లేని వాటర్ ప్లాంట్లు ఎలా నడుపుతున్నారు.


రేట్లు పెంచడం ఏమిటి ఇలాంటి వాటిపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కి ఆదేశించారు. వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటానని మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడతానని ఏఈ సభలో హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ నీళ్ల విషయంలో డబ్బా నీళ్ల అమ్మకాలపై రగడ ఇలా కొనసాగగా పలు గ్రామాల్లో టీచర్లు లేక విద్య కుంటుపడుతుందని టీచర్లను నియమించాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్ల వారీగా అభివృద్ధి పనులపై వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి మండల అభివృద్ధి అధికారి పి సాయిలు అధ్యక్షత వహించారు.


ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్రావు పాల్గొన్నారు. ప్రత్యేక సమావేశానికి అధికారులు ఎక్కువ సర్పంచులు  తక్కువగా హాజరయ్యారు. వచ్చిన ఐదు ఆరు గురు సర్పంచులతోనే మండల సమావేశం నిర్వహించారు. గ్రామ కార్యదర్శులు కూడా సగానికి సగం హాజరు కాకపోవడం సభ హాజరైన వారితోనే వాడి వేడిగా జరగడం పలు సమస్యలపై పరిష్కారం కోసం ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఎంపీడీవో అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా మండల ప్రత్యేక అధికారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ రెడ్డి, మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, హౌసింగ్ డిఇ గోపాల్, మండల వ్యవసాయ అధికారి రాజు, ఏపీవో పద్మ , ఏపిఎం జగదీష్ కుమార్, ఇరిగేషన్ శాఖ ఏఈ, ఫారెస్ట్ అధికారి, పశువైద్య డాక్టర్ వినీత్ కుమార్, మండలంలోని పలువురు సర్పంచులు, పలువురు గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్