Magazines

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపీఓ

1 గంట క్రితం

village kept clean
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

village kept cleanనవతెలంగాణ-కుభీర్
గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని మండల పంచాయతీ అధికారి భీమేష్ అన్నారు. శుక్రవారం మండలంలోని న్యూ సౌంలీ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్య రాకుండా ఉంటుందని తెలిపారు. అనంతరం పంచాయతీ రికార్డులను పరిశీలించి, సూచనలు సలహాలు అందించారు. అరులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా చూస్తామని అన్నారు. ప్రభుత్వ, పాఠశాల, అంగన్వాడీలను తనిఖీ చేశారు. విద్యార్థులకునాణ్యమైన విద్యతో పాటు ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ లక్ష్మణ్ పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్