- ప్రారంభించనున్న మంత్రి తుమ్మల
నవతెలంగాణ-సత్తుపల్లి
రేపు (బుధవారం) వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో హెటిరో గ్రూప్ సంస్థల చైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారధిరెడ్డి నేతృత్వంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వైద్య శిబిరంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభిస్తారు.
డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి నిర్వహణలో హైదరాబాద్ సింధు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బండి జన్మస్థలమైన కందుకూరు గ్రామ ప్రజలకు ఉచితంగా ఈ వైద్య శిబిరం ద్వారా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ వైద్య శిబిరంలో విశిష్ట అతిథులుగా పాల్గొననున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని హెట్రో గ్రూప్ చైర్మన్ డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి కోరారు.





కామెంట్‌లు (0)