Magazines

భీంగల్‌లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి 

1 రోజు క్రితం

Indira Gandhi
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

భారతదేశ ప్రథమ మహిళ, ప్రధానమంత్రి, మహనీయురాలు స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ..ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరచి పొలేనివని తెలిపారు.


ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంస్కరణలు చేసిన మహోన్నతురాలని కొనయాడారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు, మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మండల అధికార ప్రతినిధి వాక మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ జే జే నర్సయ్య, మున్సిపల్ కౌన్సిలర్ తోట సతీష్, అంజుమలి, మహమ్మారి సందీప్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అరిగెల జనార్దన్, మైనార్టీ మండల ప్రెసిడెంట్ కలీం, పురానిపేట్ సర్పంచ్ సుమ దేవేందర్, భీంగల్ టౌన్ వార్డ్ అధ్యక్షులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్