సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
నవతెలంగాణ - టేకుమట్ల
మండల కేంద్రంలో ఇందిరా గాంధీ 42వ వర్ధంతి, సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం సారధ్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సదానందం మాట్లాడుతూ..భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, 20 సూత్రాల కార్యక్రమం వంటి పలు కీలక నిర్ణయాల ద్వారా దేశ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు.

అనంతరం భారత ఉక్కు మనిషి, దేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన కృషి, సంస్థానాల విలీనంలో పోషించిన చారిత్రక పాత్ర దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, సేవలు నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుర్రె మల్లయ్య యాదవ్, కూర వెంకటరాజిరెడ్డి, గునిగంటి రజని మహేందర్, నాయకులు తోట గట్టయ్య, తొడేటి కుమార్, బండ రఘోతంరెడ్డి, వంగ నరేష్, కౌడగాని నవీన్, రాజేందర్, అంబాల రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)