Magazines

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా..ప్రతి కుటుంబానికి భరోసా

50 నిమిషాల క్రితం

Indiramma Family Life Insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి అర్హులని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాండురంగ పాటిల్, గోపాల్ పాటిల్, పేర్కొన్నారు. గురువారం మండలంలోని చిన్న షక్కర్గ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నిరుపేదలకు, భూమిలేని వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమి ఉన్న రైతులకే రైతు బీమా అందించిందనీ, ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాను అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రణయ్, పంచాయతీ సిబ్బంది, ఐకెపి వివో ఏ సునీత, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్