ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి
నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పార్డి(బి )గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన కుస్తాపూర్ అంజనాబాయి బాబు నూతన గృహ ప్రవేశ వేడుకలు బుధువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహ ప్రవేశ వేడుకల్లో పాల్గొని, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి పేద మధ్య కుటుంబానికి సొంత ఇంటి కల నెరవేరడం ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
అదేవిధంగా సీఎం రేవంత్రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి జూపల్లి, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమా బొజ్జు పటేల్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడి ప్రవీణ్, కుబీర్ సర్పంచ్ కందూరు సాయినాథ్, హల్దా సర్పంచ్ రజిత దేవేందర్, కుబీర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాథోడ్ అరుణ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, మాజీ జడ్పీటీసీ చౌహాన్ శంకర్, డి సి సి కార్యదర్శి సూది రాజన్న,కుబీర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కందూరు సంతోష్, మాజీ సర్పంచ్ విజయ్, మంగళ్ సాయి, బెల్లల గంగాధర్, ఆల్కే దత్తాత్రీ. సాతాం రవి, మిలింద్ తదితర నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)