Magazines

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు

1 గంట క్రితం

Bathukamma celebrations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో దసరా నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సందడి చేశారు.


ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల సమన్వయకర్త జూపల్లి రమణారావు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పండుగ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు బహుమతులు అందజేశారు. గ్రామస్థులకు, మహిళలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా గ్రామస్థులు బీఆర్ఎస్ మండల నాయకులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మాజీ జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్‌రావు, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాద్, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, మండల నాయకుడు మందపాటి రాజామోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్