Magazines

ఉరేసుకుని యువకుడు మృతి

1 గంట క్రితం

Young man dies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మున్సిపాలిటీ నెహ్రూనగర్‌లోని కాగిత శ్రీరంజిత్‌ (19) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీరంజిత్‌ తల్లిదండ్రులు కాగిత నాగ ముత్యాలరావు, జ్యోతి రెండేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. రంజిత్‌ తన అమ్మమ్మ పానుగంటి కుమారి ఇంట్లో నివసిస్తున్నాడు.


ఈ క్రమంలో రంజిత్‌ అమ్మమ్మ ఇంట్లో నేడు ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో రంజిత్‌ మనస్తాపానికి గురై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, మృతికి గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతుడి అమ్మమ్మ పానుగంటి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్సై దేవ్‌సింగ్‌ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్