- శ్రీను భౌతిక కాయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జారె, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు లిక్కి బాలరాజు
నవతెలంగాణ - అశ్వారావుపేట
మండలంలోని అచ్యుతాపురం కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త తెల్లగొర్ల నాగేంద్ర తండ్రి శీను(55) అనారోగ్యం తో గురువారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, అశ్వారావుపేట వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు లు శ్రీను పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.అతని కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వెలిబుచ్చారు. శ్రీను కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్థానిక నాయకులు కొల్లు చంద్ర శేఖర్, కొనకళ్ళ చెన్నారావు,మండల నాయకులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)