- భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ రాజీవ్ కాలనీలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సందర్శించారు. ఆలయ సందర్శనకు వచ్చిన దయానంద్ విజయకుమార్ కు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దయానంద్ స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం, అయ్యప్ప స్వామి మాలాధారణ చేపట్టిన భక్తులకు, భవానీ దీక్ష చేపట్టిన భక్తులకు దయానంద్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, వినుకొండ కృష్ణ, కాసర చంద్రశేఖరరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)