Magazines

​మంత్రి తుమ్మలతో ఎమ్మెల్యే రాగమయి భేటీ

1 గంట క్రితం

Minister Thummala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా, ​దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.

​ఈ సందర్భంగా మంత్రికి ఆమె దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు అభివృద్ధి సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు.


వేంసూరు మండల పరిధిలోని కల్లూరుగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఎమ్మెల్యేతో  సమీక్షించారు. సత్తుపల్లి, వేంసూరు మండలాలకు గోదావరి జలాలను అందించేందుకు చేపట్టిన ప్రాజెక్ట్ పనులు, నాగుపల్లి వద్ద జరుగుతున్న గోదావరి జలాల టేకింగ్/పంపింగ్ పనుల ప్రస్తుత వివరాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కు  వివరించారు. ​నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు సకాలంలో అందేలా త్వరితగతిన పనులు పూర్తి కానున్నాయని మంత్రి తెలిపారు. ​ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్