నవతెలంగాణ బెంగళూరు: అమేజాన్ ఇన్ ఫ్లూయెన్సర్ ప్రోగ్రాం భారతదేశంలో 2 లక్షలకు పైగా సృష్టికర్తలకు (క్రియేటర్లకు) విస్తరించింది. ఇప్పుడు యూట్యూబ్, పింటరెస్ట్ కంటెంట్‌లో అమేజాన్ ఉత్పత్తులను ట్యాగ్ చేయడం ద్వారా క్రియేటర్లు కమిషన్లు పొందే అవకాశం లభించింది. ఈ ఏడాది సృష్టికర్తల ద్వారా సుమారు 40 మిలియన్ల మంది కస్టమర్లు కొనుగోళ్లు జరిపారని అమేజాన్ సోషల్ కామర్స్ హెడ్ నిధి ఠక్కర్ మరియు యూట్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ గుంజన్ సోనీ వెల్లడించారు. అమేజాన్ ద్వారా సృష్టికర్తల సగటు ఆదాయం ఏడాదికి 60% పెరిగిందని, కొనుగోలుదారులు మరియు సృష్టికర్తలలో సుమారు 70% కంటే ఎక్కువ మంది నాన్-మెట్రో నగరాల నుంచే ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. క్రియేటర్ రివార్డ్స్, క్రియేటర్ కనక్షన్స్, క్రియేటర్ యూనివర్శిటీ వంటి సాధనాల ద్వారా సృష్టికర్తలు స్థిరమైన వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి అమేజాన్ తోడ్పడుతోంది.
2 లక్షల మార్కును దాటిన అమేజాన్ ఇన్ ఫ్లూయెన్సర్ నెట్‌వర్క్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)