- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా
- జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ అప్పారావు
నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేలా మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ అప్పారావు ఆదేశించారు. పథకం అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.
శనివారం నుంచి ఈ పథకం కార్యాచరణ అమల్లోకి రానున్న నేపథ్యంలో బుధవారం అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం అమలు విధానం, అధికారుల బాధ్యతలు, చేపట్టాల్సిన కార్యాచరణపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో వాల్మీకి కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీఓ రామకోటారెడ్డి, జీపీఓ, పంచాయతీ కార్యదర్శులు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)