- రోడ్లపై పశువుల సంచారానికి అడ్డుకట్ట
- యజమానులకు మున్సిపాలిటీ కౌన్సెలింగ్
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట పట్టణంలో రోడ్లు, హైవేలపై పశువుల సంచారాన్ని నియంత్రించేందుకు మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. డివైడర్లలో నాటిన మొక్కలను పశువులు తినేస్తుండటంతో పట్టణ సుందరీకరణకు ఆటంకం కలుగుతోంది. మరోవైపు రహదారులపై పశువుల సంచారంతో వాహనదారులకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు ఆదేశాల మేరకు రోడ్లపై సంచరిస్తున్న పశువులను పట్టుకుని నిర్దేశిత ప్రదేశంలో కట్టేశారు. అనంతరం యజమానులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పశువులను రోడ్లపై వదలకుండా బాధ్యతగా సంరక్షించాలని సూచించి వాటిని అప్పగించారు. డివైడర్లలో మొక్కల పరిరక్షణతో పాటు రహదారులపై పశువుల వల్ల ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.







కామెంట్లు (0)