Magazines

బాధిత కుటుంబానికి చెక్కు అందజేత

1 గంట క్రితం

Cheque
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కుభీర్
మండలం పరిధిలోని చోండి గ్రామానికి చెందిన బంధర్వర్ సంతోష్ (రైతు) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఎల్ ఐ సి ప్రమాద భీమా కింద మంజూరైన రూ. 2 లక్షల చెక్కును గురువారం వ్యవసాయ సహకార సంఘ చెర్మన్ రేకుల గంగాచరణ్ మృతుడి భార్య ముత్తు బాయికి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ముందుగా సహకార సంఘ బీమా పథకంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రమాదవశాత్తూ వ్యక్తికి మరణం సంభవిస్తే.. కుటుంబానికి బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రకాంత్, క్రాంతికుమార్, వెంకట రమణ, శివరాం, గణేష్,తదితరులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్