నవతెలంగాణ - తొగుట
రోడ్లపై రైతులు ధాన్యాన్ని ఆరబెట్టొద్దని ఎస్సై నవీన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 17న రాత్రి సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్‌కు చెందిన మద్దూరు గోపాల్ (29) ఊరునుంచి గజ్వేల్‌కు వాహనంపై వెళ్తుండగా రోడ్డుపై రైతులు నిర్లక్ష్యంగా ఆరబెట్టిన మొక్క జొన్న ధాన్యం కుప్పను తాకి కింద పడిపోయాడని పేర్కొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైందని వెల్లడించారు. చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్సకు సికింద్రాబాద్ యశోదకు తరలించామని తెలిపారు.
అయినా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టిన ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొని రోడ్లపై ఎవరూ ధాన్యాన్ని ఆరబెట్టొద్దని హెచ్చరించారు. లేనియెడల చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. “ప్రజల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రోడ్డు భద్రతకు సహకరించి విలువైన ప్రాణాలను కాపాడాలి” అని ఎస్‌ఐ నవీన్ కోరారు. మృతునికి భార్య అనూష, 2 సంవత్సరాల పాప ఉన్నారు.






కామెంట్‌లు (0)