నవతెలంగాణ-అచ్చంపేట
మండల కేంద్రానికి చెందిన జంపుల గణేష్-చైతన్యల కూతురు జంపుల విద్య ఎంబిబిఎస్ సీటు సాధించింది. తండ్రి కులవృత్తి హెయిర్ కటింగ్ షాపు నిర్వహిస్తూ..తల్లి ఇంట్లో కుట్టు మిషన్ నిర్వహిస్తూ జీవనం గడుపుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని నిరంతరం గమనించిన కుమార్తె విద్య కష్టపడి చదివి డాక్టర్ కావాలని లక్ష్యంతో సీటు సాధించింది.
నారాయణ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసుకుని మెడిసిన్ రాసింది. కొడంగల్ గవర్నమెంట్ కాలేజీలో ఎంబిబిఎస్ సీట్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. భవిష్యత్తులో వైద్యులుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించి తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని గ్రామస్తులు విద్యను అభినందించారు.




కామెంట్లు (0)