Magazines

అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారె విస్తృత పర్యటన

4 గంటల క్రితం

MLA Jare
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

- మహిళా సమాఖ్య భవనాల ప్రారంభోత్సవాలు

- ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాల ఆవిష్కరణ

- సీఎంఆర్ఎఫ్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం అశ్వారావుపేట లో పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.  గ్రామీణ మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు దోహదపడేలా నిర్మించిన గ్రామీణ మహిళా సమాఖ్య (వీఓ) భవనాలను ప్రారంభించనున్నారు. అలాగే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు, అశ్వారావుపేట పట్టణంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.


పర్యటన షెడ్యూల్‌ ఇలా..

ఉదయం 11 గంటలకు అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అనంతారం 2:30 గంటలకు నారాయణపురంలో మూడు వీఓ భవనాలు, 3 గంటలకు బచ్చువారిగూడెంలో వీఓ భవనాన్ని ప్రారంభించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్