Magazines

జీవో 6ను అమలు చేయని పరిశ్రమ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి

1 గంట క్రితం

CITU
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం

సిఐటియు జిల్లా కార్యదర్శి జి. సాయిలు

సంగారెడ్డి జిల్లా కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అతిమేల మానిక్

కలెక్టరేట్ ముందు కార్మికులతో సిఐటియు ధర్నా

నవతెలంగాణ-సంగారెడ్డి 

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల జీవో 6 ను అమలు చెయ్యని పరిశ్రమ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు, సంగారెడ్డి జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డి  కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు, డిప్యూటీ లేబర్ కమిషనర్ (డీసీఎల్) యాదయ్య లకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలను సవరిస్తూ జీవో నెం.6ను రాష్ట్ర ప్రభుత్వం 2026 మే30న నోటిఫికేషన్ విడుదల చేసిందని, పెరిగిన కనీస వేతనాలు జూన్ ఒకటో తేదీ నుండి అమలు చేయాలని జీవోలు పేర్కొన్నారని అన్నారు. జీవో వచ్చి నాలుగు నెలలైనా సంగారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమల్లో నేటికీ జరిగిన కనీస వేతనాలు అమలు కావడం లేదని అన్నారు. ఒకవేళ ఆలస్యంగా ఇచ్చినూ ఏరియర్స్ కట్టివాలని జీవోలో ఉందని అన్నారు.


కనీస వేతనాలు ఈఎస్ఐపిఎఫ్ బోనస్ ఓటి సెలవులు వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించకుండా కార్మికులను శ్రమదోపిడికి యాజమాన్యాలు పాల్పడుతున్నాయని అన్నారు. కనీస వేతనాలను శాస్త్రీయంగా సవరించి రూ.42,000/- లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులకు తీవ్ర నష్టం చేసే లేబర్ కోడ్స్ తెచ్చి కట్టు బానిసలుగా మారుస్తుందని అన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులను సంఘటితం చేసి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.


అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ లో మల్టిపుల్ డేస్ ధర్నా నిర్వహిస్తామని, అక్టోబర్ 25న పారిశ్రామిక కార్మికులతో జరిగే  మహాధర్న లో కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కే.రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వి. ప్రవీణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఎన్.మల్లేష్, ఎన్.రాజు, మోహన్ రెడ్డి, శంకర్, బిలాల్, సుధాకర్ రెడ్డి, సంతోష్ గౌడ్,  శ్రీనివాస్ తదితరులు వివిధ పరిశ్రమల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

CITU

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్