నవతెలంగాణ-ఆలేరుటౌను
ఇల్లు లేని పేదల సొంతింటి కల నెరవేరుస్తానని, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలేరు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు పట్టణంలో శనివారం ఆలేరు, యాదగిరిగుట్ట, మోటకొండూరు , గుండాల, ఆత్మకూరు , రాజపేట, బొమ్మలరామారం మండలాల చెందిన 250 మంది దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉత్తర్వు కాఫీలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 3500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. సుమారు రెండు వందల గుడిసెలను గుర్తించి, ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి, పిఎసిఎస్ చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయని అన్నారు.
ఈ సమావేశంలో బీసీ జిల్లా వెల్ఫేర్ అధికారి శ్రీరాములు, పిడి హౌసింగ్ అధికారి అలివేలు, ఎమ్మార్వో ఆంజనేయులు,ఎంపీడీవో సత్య ఆంజనేయ ప్రసాద్,సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, ఎస్ ఐ వినయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసారపు యాదగిరి, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఎంపీడీవోలు, కాంగ్రెస్ నాయకులు గంధ మల్ల అశోక్,జనగాం శ్రీపాల్ రెడ్డి, కే సాగర్ రెడ్డి, ఎంఎ ఇజాస్, ఎంపీటీసీ ఆరే ప్రశాంత్,ఇంజ నరేష్, బుడిగే పెంటయ్య, పంచాయతీ కార్యదర్శులు,8 మండలాల లబ్ధిదారులు, మున్సిపల్,
పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





కామెంట్లు (0)